ఎన్నో ఏళ్ల చిక్కుముడికి పరిష్కారం చూపించాం: సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నో ఏళ్ల చిక్కుముడికి పరిష్కారం చూపించాం: సీఎం రేవంత్ రెడ్డి

ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ఎస్సీ బిల్లు ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ సంఘాలు అభినందలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్.. ఎస్సీ వర్గీకరణపై సుధీర్ఘ నిరీక్షణకు తెరపడిందన్నారు.  పట్టుదలతో దళితులకు న్యాయం చేశామన్నారు.ఎన్నో ఏళ్ల చిక్కుముడికి పరిష్కారం చూపించానన్నారు.  ఎవరు ఏమనుకున్నా దళిత  జాతికి న్యాయం జరిగిందని చెప్పారు రేవంత్.  కాంగ్రెస్ ఎప్పుడు దళితుల పక్షానే ఉంటుందన్నారు సీఎం రేవంత్

దళిత ఎమ్మెల్యేను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిందన్నారు సీఎం రేవంత్..కాంగ్రెస్ బిల్లు పెట్టడంతో బీఆర్ఎస్ అనివార్యంగా మద్దతిచ్చిందన్నారు.  బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట  వర్గీకరణ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.  దళితులను ఉన్నత స్తానాల్లో నియమించామని చెప్పారు.  ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ చేస్తున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో చేయలేదన్నారు. సీనియర్ లాయర్లను నియమించడంతో ఈ కేసు గెలిచామన్నారు రేవంత్. సుప్రీం కోర్టు  తీర్పును అమలు చేశామన్నారు.  ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదన్నారు రేవంత్.ఎస్సీ వర్గీకరణలో  15 శాతం రిజర్వేషన్ల కేటాయించామని తెలిపారు. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి  మొత్తం గ్రూప్‌-1లో ఒక శాతం, గ్రూప్‌-2లో  9శాతం, గ్రూప్‌-3కి  5 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు రేవంత్.

Also Read :- ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా

నన్ను ఒక్కడినే కాదు..రాహుల్ ను కూడా అభినందించాలన్నారు రేవంత్. అభినందన సభ పెడితే రాహుల్ కూడా వస్తారని చెప్పారు.  సీఎంగా మీ వాడే ఉన్నాడని భావించాలన్నారు. ఎస్సీ కులాల సంక్షేమం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్.