ఇయ్యాల ( ఏప్రిల్ 30న) వనపర్తిలో మంత్రి పొంగులేటి పర్యటన

ఇయ్యాల ( ఏప్రిల్ 30న)  వనపర్తిలో మంత్రి పొంగులేటి పర్యటన

వనపర్తి, వెలుగు: వనపర్తిలో బుధవారం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని అధికారులను ఆదేశించారు. మంత్రి  వెళ్లనున్న పలు ప్రదేశాలు, హెలీపాడ్ ను మంగళవారం పరిశీలించారు. మంత్రి వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థుల హాస్టల్, లెక్చరర్ల బిల్డింగ్​లను ప్రారంభిస్తారని తెలిపారు. 

కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆధునీకరించిన బీసీ బాయ్స్​హాస్టల్, బీఆర్.అంబేడ్కర్ చెరువు సుందరీకరణ పనులను ప్రారంభిస్తారని చెప్పారు. కల్యాణసాయి ఫంక్షన్ హాల్లో రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఏడీసీ యాదయ్య, ఆర్అండ్​బీ ఈఈ  దేశ్య నాయక్, ఆర్డీవో సుబ్రమణ్యం తదితరులున్నారు.  

అమ్మాపూర్​లో సదస్సు ఏర్పాట్ల పరిశీలన

చిన్నచింతకుంట, వెలుగు: మండలంలోని  అమ్మా పూర్ శివారు కురుమూర్తి దేవస్థానం వద్ద బుధవారం రైతులకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నందున సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్​విజయేందిర బోయి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి మంగళవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్​కలెక్టర్(లోకల్​బాడీస్​) శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో నవీన్, డీఆర్డీవో నర్సింహులు, డీపీవో పార్ధసారథి తదితరులున్నారు.