క్రీడల్లోనూ మహిళలు ప్రతిభ చూపారు : అద్వైత్ కుమార్ సింగ్

క్రీడల్లోనూ మహిళలు ప్రతిభ చూపారు : అద్వైత్ కుమార్ సింగ్
  • కలెక్టర్​ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్ , వెలుగు:  మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని  జిల్లా కలెక్టర్​ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు.  గురువారం  తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడా పోటీల్లో  గెలుపొందిన  విజేతలకు బహుమతులను అందించారు.  రోజూ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్న మహిళలు క్రీడల్లోనూ  ప్రతిభ చూపారన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు లెనిన్​ వత్సల్​ టొప్పో, కె. వీరబ్రహ్మాచారి, టీజీవో జిల్లా అధ్యక్షుడు మమ్మద్ రఫీ, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ ధనమ్మ, నాయకులు కొప్పు ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్, పి . రాజేంద్రప్రసాద్, క్రీడా విజేతలు నీలోఫర్, స్వరూప, సుస్మిత, అనిత, సరిత, తబాష్మ, కళ్యాణి, ప్రసన్న, అలివేలు, సంధ్యారాణి, శ్రావణి, తదితరులు  పాల్గొన్నారు.