కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి : ఆశిష్​ సంగ్వాన్​

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి : ఆశిష్​ సంగ్వాన్​
  •  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డి టౌన్​, వెలుగు : యాసంగి సీజన్​కు సంబంధించి వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు.  శుక్రవారం కలెక్టరేట్​లో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడారు.  జిల్లాలో 446 సెంటర్లకు గాను ఇప్పటి వరకు 33 సెంటర్లు ఓపెన్​ చేసి కొనుగోళ్లు షూరు చేశామన్నారు.  

మిగతా చోట్ల కూడా సెంటర్లు వెంటనే తెరవాలన్నారు. అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు.  జిల్లాలో 15 జొన్న కొనుగోలు సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్​ విక్టర్​,  డీఎం రాజేందర్, డీఎస్​వో మల్లికార్జునబాబు,  డీసీవో రాంమోహన్​రావు తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం పంపిణీ స్పీడప్​ చేయాలి ..

రేషన్​ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ స్పీడప్​ చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్​ సూచించారు.  578 రేషన్​ షాపులకు  5571 మెట్రిక్ టన్నుల బియ్యం సప్లయికిగాను ఇప్పటి వరకు  5527 మెట్రిక్​ టన్నుల బియ్యం సరఫరా చేశామన్నారు.  ఈ నెల 15లోగా లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందాలన్నారు.    

రేషన్​ కార్డుల అప్లికేషన్లను పరిశీలించాలి..

నూతన రేషన్​ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్  మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీల సెక్రటరీలు పరిశీలించాలని సూచించారు.  మీ సేవా ద్వారా వచ్చిన వాటిని రెవెన్యూ అధికారులు పరిశీలించాలన్నారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూడాలన్నారు.  

 గ్రామ పాలన అధికారుల నియమకానికి అప్లికేషన్ల స్వీకారం

గ్రామ పాలన అధికారుల నియమకానికి అర్హులైన మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలు అప్లయ్​ చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్​లైన్లో ఫారం నింపి , ఫిజికల్​గా సంతకం చేసి వీటిని కలెక్టరేట్​లో ఈ నెల 16లోగా ఇవ్వాలని తెలిపారు.