
కామారెడ్డి, వెలుగు : కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ( సీఎంఆర్) నిర్ధేశిత గడువులోగా సప్లయ్ చేయని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని సివిల్ సప్లయ్ అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో సీఎంఆర్‌పై అధికారులతో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్ మాట్లాడారు. సీఎంఆర్ సేకరణ స్పీడప్ కావాలన్నారు. 2023–24 యాసంగి, 2024–25వానకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ సేకరణపై అధికారులు మిల్లులను తనిఖీ చేయాలన్నారు.
సీఎంఆర్ కంప్లీట్ చేయని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. 2023–24 యాసంగి సీజన్‌కు సంబంధించి 54 శాతం కంప్లీట్ అయ్యిందని, ఈ నెల 17 నాటికి పూర్తి చేయాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వ అగ్రీమెంట్ ప్రకారం ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేసే బియ్యానికి సంబంధించి జిల్లాకు 3వేల టన్నులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, డీఎస్వో మల్లికార్జునబాబు, సివిల్ సప్లయ్ డీఎం రాజేంధర్, మార్కెటింగ్ ఆఫీసర్ రమ్య తదితరులు పాల్గొన్నారు.