ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయండి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయండి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

లింగంపేట, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అన్నారు.  గురువారం మండలంలోని ముస్తాపూర్​ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలెక్టర్​ మాట్లాడారు. గ్రామంలో149 మంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులు ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించాలన్నారు.  

రేషన్​కార్డుల వెరిఫికేషన్​ పూర్తి చేసి కార్డులను అందజేయాలని సూచించారు. అనంతరం గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ ప్రారంభించారు.  కలెక్టర్​ వెంట డీఆర్డీవో  పీడీ సురేందర్, డీఎస్​వో మల్లికార్జున్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజేందర్, ఎల్లారెడ్డి , ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేష్​, ఎంపీడీవో నరేష్​ ఎంపీవో మలహరి, పంచాయతీ సెక్రటరీ శ్రావణ్​కుమార్​  ఉన్నారు.