నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాల అమలును స్పీడప్ చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో అధికారులతో వివిధ అంశాలను రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలని సూచించారు. అర్హులైన రైతుల వివరాలను సేకరించి రైతు భరోసా లిస్టులో పేర్లు చేర్చాలన్నారు. డీఆర్డీవో చిన్న ఓబులేషు, డీఏవో చంద్రశేఖర్, డీపీవో రామ్మోహన్రావు, డిప్యూటీ సీఈవో గోపాల్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.