పేదలకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం నల్గొండ మండలం రాములబండ తండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు, ఓపీ సంఖ్య పెంచాలని తెలిపారు. 

రాములబండ తండా పీహెచ్ పీలో స్టాఫ్ నర్సుతోపాటు, ల్యాబ్ టెక్నీషియన్ ను నియమించాలని కోరగా, ఆమె సానుకూలంగా స్పందించారు. కలెక్టర్​ వెంట జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.