![ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినవారిని ప్రైవేట్ ల్యాబ్ కు పంపిస్తే చర్యలు : హనుమంతరావు](https://static.v6velugu.com/uploads/2025/02/collector-hanumantha-rao-conducts-surprise-inspection-of-primary-health-center_yR8hH5UoOc.jpg)
- కలెక్టర్ హనుమంతరావు
భూదాన్ పోచంపల్లి, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినవారిని ప్రైవేట్ ల్యాబ్ కు పంపిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు వైద్య సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెల్త్ సెంటర్ లో ల్యాబ్ టెక్నీషియన్ టీఎస్ విలియమ్స్ విధులకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్యాధికారులు సమయపాలన పాటించాలన్నారు. మందుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. స్వయంగా ఓపీ రిజిస్టర్ లో నమోదైన పేషెంట్ కు ఫోన్ చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం మంచిగా అందిస్తున్నారా ? అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైద్యాధికారులు ఉన్నారు.