
- కలెక్టర్ హనుమంత రావు
యాదాద్రి, వెలుగు : బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లతోపాటు ప్యాకేజీ 14 కు కాలువల కోసం అవసరమైన భూమిని స్పీడ్‌గా సేకరించాలని కలెక్టర్ హనుమంత రావు అన్నారు. ప్రభుత్వానికి సంబంధించి సెంటు భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణపై బుధవారం కలెక్టరేట్లో మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా బస్వాపూర్ రిజర్వాయర్‌కు మరో 250 ఎకరాలు సేకరించాల్సి ఉందని ఆఫీసర్లు తెలిపారు. గంధమల్ల రిజర్వాయర్ కోసం 1100 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు.
బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితుల కోసం నిర్మించే హుస్సేనాబాద్‌లోని కాలనీకి నీరందించడానికి పైప్‌లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సెంటు భూమి అన్యాక్రాంతం కూడా చూడాలని చెప్పారు. భూ సర్వే కోసం వచ్చిన అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మీటింగ్‌లో అడిషినల్ కలెక్టర్వీరారెడ్డి, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, సర్వే ల్యాండ్ ఆఫీసర్జగన్నాథరావు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్‌పాల్గొన్నారు.