రక్తదానం.. మరొకరికి ప్రాణదానం : హనుమంతరావు

రక్తదానం.. మరొకరికి ప్రాణదానం : హనుమంతరావు
  • కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు : ఒకరి రక్తదానం.. మరొకరికి ప్రాణాన్ని పోస్తుందని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్గాన్ డొనేషన్ పై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది పేషెంట్లు చనిపోతున్నారని తెలిపారు. 

ఈ మధ్యకాలంలో ఆర్గాన్ డొనేట్ పై ప్రజలకు అవగాహన వచ్చిందని, రక్తదానం చేయడానికి చాలామంది ముందుకొస్తున్నారని చెప్పారు. ఆస్పత్రిలో బ్లడ్ షార్టేజ్ ఉన్నందున త్వరలో పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేట్ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రక్తదానం చేసిన ప్రతిఒక్కరికీ కలెక్టర్ పేరుపేరునా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రాజారాం, చిన్ననాయక్ తదితరులు పాల్గొన్నారు.