క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

 క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

నల్గొండ అర్బన్, వెలుగు : ఇటీవల వివిధ రాష్ట్రాల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాఫ్ట్​ బాల్, రగ్బీ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను సోమవారం కలెక్టరేట్​లో కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  2024-–25 విద్యాసంవత్సరంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో జిల్లా నుంచి ఎక్కువమంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని తెలిపారు.  

గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

గురుకుల వీటీజీ సెట్-–2025 నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు 5,6,7,8,9 తరగతుల్లో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 1 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వీటీజీ సెట్–2025 ఫ్లెక్సీ, గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 23న గురుకులాల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు కుల, ఆదాయం సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫోటోలతో మీ సమీపంలోని మీసేవా సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.