నార్మల్​ డెలివరీలకే ప్రాధాన్యం ఇవ్వాలి

నార్మల్​ డెలివరీలకే ప్రాధాన్యం ఇవ్వాలి

నకిరేకల్, వెలుగు:  గవర్నమెంట్​ ఆస్పత్రుల్లో నార్మల్​ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని  కలెక్టర్  ఇలా త్రిపాఠి అన్నారు.  బుధవారం ఆమె నకిరేకల్ మండలం, ఓగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని  తనిఖీ చేశారు.   రిజిస్టర్లను పరిశీలించారు.   పీహెచ్​సీలో  ప్రసవాలు లేక పోవడంపై ఆమె మాట్లాడుతూ జీరో డెలివరీలు ఎందుకు ఉన్నాయని అడిగారు. ఇక్కడ డెలివరీలు నిర్వహిస్తున్నారా? సి సెక్షన్ చేస్తున్నారా? డాక్టర్లందరూ విధులకు హాజరవుతున్నారా అని వైద్య అధికారిని ప్రశ్నించారు.  

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే సాధారణ ప్రసవాలను ప్రోత్సహించినట్లయితే మాత, శిశు సంరక్షణతో పాటు, మాతా శిశు మరణాలను తగ్గించవచ్చని, జిల్లా స్థాయి ఆస్పత్రులపై భారాన్ని తగ్గించవచ్చని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు.  రోగులను కావాలని ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించినట్లు తమ దృష్టికి వస్తే అలాంటి డాక్టర్ల  లైసెన్సు రద్దు చేస్తామని   హెచ్చరించారు.