జిల్లా సమగ్ర పుస్తకాన్ని విద్యార్థులతో చదివించాలి : కలెక్టర్ జితేశ్​వి పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా సమగ్ర స్వరూప పుస్తకాన్ని విద్యార్థులతో చదివించాలని కలెక్టర్ జితేశ్​వి పాటిల్​ పేర్కొన్నారు. విద్యార్థుల కోసం 600 పుస్తకాలను సారసత్వ పరిషత్ నుంచి తెప్పించినట్లు కలెక్టర్​తెలిపారు. శుక్రవారం వాటిని ఆయన రిలీజ్​చేశారు. 

జిల్లాకు సంబంధించిన సమగ్ర వివరాలు బుక్​లో ఉన్నాయన్నారు. జిల్లాలోని హైస్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలు,  లైబ్రరీల్లో స్టూడెంట్స్​కోసం అందుబాటులో ఉంచుతామన్నారు. అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్,   సీపీవో రాజారాం, డీఈవో  రాజు, ఇంటర్ ​నోడల్ ఆఫీసర్​ షేక్​సలాం, డాక్టర్​వి.శంకర్​ పాల్గొన్నారు.