- కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి, వెలుగు: మార్చి 5 నుంచి జరిగే ఇంటర్‌పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రాక్టికల్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ నిర్వహించే కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
వచ్చేనెల 3 నుంచి ప్రాక్టికల్స్ జరిగే కేంద్రాల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టూడెంట్స్సంఖ్యకు సరిపడా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 3 నుంచి 22వరకు జరుగుతాయన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, ఇంటర్‌బోర్డ్ ఆఫీసర్ గోవిందరావు, డీఎంహెచ్‌వో గాయత్రీ దేవి, పోస్టల్‌శాఖ సూపరింటెండెంట్మురళీ, ఆర్డీవో అరుణ పాల్గొన్నారు.