నీట్ సెంటర్లలో కెమెరాలు బిగించండి : కుమార్ దీపక్

నీట్ సెంటర్లలో కెమెరాలు బిగించండి : కుమార్ దీపక్
  • కలెక్టర్ కుమార్ దీపక్ 

నస్పూర్, వెలుగు: మే 4న జరిగే నీట్ ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ఎగ్జామ్​ సెంటర్లలో సీసీ కెమెరాలు బిగించాలన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్, డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీట్ కు జిల్లాలోని 1,204 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. వీరికి  ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల, తెలంగాణ ఆదర్శ పాఠశాల- రాజీవ్ నగర్, మంచిర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, సెంటర్ల వద్ద 144, 163 సెక్షన్లు అమలు చేయాలని సూచించారు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రసాద్, వైద్యారోగ్య, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.