వేసవిలో తాగు నీటికి ఇబ్బందుల్లేకుండా చూడాలి : కలెక్టర్ కుమార్​ దీపక్

వేసవిలో తాగు నీటికి ఇబ్బందుల్లేకుండా చూడాలి : కలెక్టర్ కుమార్​ దీపక్

చెన్నూరు, వెలుగు: వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 6,7 వార్డుల్లో తాగునీటి సరఫరా ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బం దులు రాకుండా శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు. నీటి ట్యాంకుల లీకేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పట్టణంలోని జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శిం చారు. 

కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన పత్తి, పత్తి విత్తనాలను తక్షణమే తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం చెన్నూర్​లోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి వార్డులు, రిజిస్టర్లు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. ఆస్పత్రిలో టీబీ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు పరిశీలించారు.