పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి : మనుచౌదరి

పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి : మనుచౌదరి
  • కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా స్టూడెంట్స్​ను సిద్ధం చేయాలని కలెక్టర్​మనుచౌదరి విద్యాశాఖ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల హెచ్​ఎంలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ.. గత రెండేళ్ల మాదిరిగానే ఈసారి కూడా పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఇందుకోసం స్టూడెంట్స్​ను ప్రత్యేకంగా చదివించాలన్నారు. టీచర్లు వెనుకబడిన స్టూడెంట్స్​పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్టూడెంట్స్​కు స్నాక్స్ కోసం రూ. 25 లక్షలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉమ్మడి పరీక్షల సెక్రటరీ షౌకత్ అలీ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మయ్య, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి పాల్గొన్నారు.