అర్హులందరికీ సంక్షేమ పథకాలు : మనుచౌదరి

  • కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట, వెలుగు: అర్హులందరికీ  సంక్షేమ పథకాలు అందించడానికి అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు.  శుక్రవారం చిన్నకోడూరు మండలం రామునిపట్ల, నారాయణ రావు పేట మండలం గుర్రాలగొంది గ్రామాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై జరుగున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను  కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఫీల్డ్ లో జరుగుతున్న సర్వే వివరాల సేకరణ లో సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలను గూర్చి ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పథకాల డ్రాఫ్ట్ వివరాలను తయారు చేసే ప్రక్రియ ఈ నెల 16 నుంచి 20వరకు పూర్తి చేస్తామన్నారు. 21నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు, మున్సిపాలిటీలో వార్డు సభలు ఏర్పాటు చేసి అసలైన లబ్ధిదారులను గుర్తిస్తామన్నారు. 26న అందరి సమక్షంలో లబ్ధిదారులకు పత్రాల పంపిణీ చేస్తామని తెలిపారు.