నా ఖమ్మం కోసం నేను..  రూ.11 లక్షలకు పైగా సేకరణ

నా ఖమ్మం కోసం నేను..  రూ.11 లక్షలకు పైగా సేకరణ

ఖమ్మం, వెలుగు: జిల్లాలో వరద బాధితుల సహాయార్థం కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​ కొత్త ఆలోచన చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రతి విగ్రహం దగ్గర ప్రత్యేక హుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. అందులో డబ్బులతో పాటు బట్టలు, బియ్యం, దుప్పట్లు, చెప్పులు సహా ఏదైనా విరాళంగా ఇవ్వొచ్చని ప్రకటించారు.

3దీంతో చాలా చోట్ల హుండీతో పాటు డ్రమ్మును ఏర్పాటు చేసి విరాళాలను సేకరించారు. వాటికి ప్రత్యేకంగా ‘నా ఖమ్మం కోసం నేను’ అని స్టిక్కర్లను అంటించారు.

గురువారం నాటికి రూ.11.20 లక్షల నగదు, 7,419 కిలోల బియ్యం, 1,230 జతల బట్టలు, 9 దుప్పట్లు, 75 స్టేషనరీ నోట్ పుస్తకాలు, 2 జతల చెప్పులు, 2 ఇతర వస్తువులు జమ అయ్యాయి. ఈ కార్యక్రమానికి జనం నుంచి వస్తున్న స్పందన పట్ల కలెక్టర్​ ముజామ్మిల్ సంతోషం వ్యక్తం చేశారు.