- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
- జాఫర్ బావి పునరుద్ధరణ పనుల పరిశీలన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం ఖిల్లా పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేయనున్న రోప్ వే, జాఫర్ బావి అభివృద్ధి తో ఖమ్మం పర్యాటక ప్రాంతంగా మారుతుందని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం ఖిల్లా ప్రాంతం పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా జాఫర్ బావి పునరుద్ధరణతో పాటు, రోప్ వే ఏర్పాటు పనులను అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు.
ఖిల్లాకు రోప్ వే ఏర్పాటుకు అనువుగా ఉండే మార్గం, ఎక్విప్మెంంట్, రావడానికి రోడ్డు అనుకూలత, పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఖిల్లాపై పర్యాటకు లకు ఆహ్లాదం కలిగే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, అర్బన్ తహసీల్దారు రవికుమార్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారు.