- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌లోని మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర ఆలయంలో ఫిబ్రవరి 2 నుంచి 10 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు.
భక్తులకు తాగునీరు, షామియానా, క్యూ లైన్లు, బారికేడ్లు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. భక్తులకు డెయిలీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇన్‌చార్జి డీఆర్‌వో పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ నుంచి స్టూడెంట్లను కాపాడాలి
మత్తు పదార్థాల బారిన పడకుండా విద్యార్థులను కాపాడాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు.
నిత్యం కాలేజీలు, హాస్టళ్లను సందర్శించాలన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ రవాణా కాకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఈవో జనార్ధన్ రావు,అగ్రికల్చర్ ఆఫీసర్ విజయ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.