ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పకడ్బందీగా అమలుచేయాలి : పమేలా సత్పతి

ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పకడ్బందీగా అమలుచేయాలి : పమేలా సత్పతి
  • కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని  కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన తేదీ నుంచి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు  తొలగించాలన్నారు. 

సరైన పత్రాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తరలిస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమనిబంధనలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం రోడ్డు భద్రత మాసోత్సవాలపై వైద్యశాఖ, ఆర్టీసీ, పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖ అధికారులతో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్, లక్ష్మీకిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో పవన్ కుమార్, ఆర్డీవో మహేశ్వర్ ల్గొన్నారు.

కరీంనగర్ బల్దియా స్పెషల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్​ స్పెషల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కలెక్టర్ పమేలాసత్పతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధికి అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి పాల్గొన్నారు.