మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలి : పమేలా సత్పతి

మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలి : పమేలా సత్పతి
  • కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: దేశంకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం శాతవాహన యూనివర్సిటీలో సమగ్రాభివృద్ధికి సంక్షేమ పథకాలు అనే అంశం పై నిర్వహించిన వర్క్ షాప్ లో వీసీ ఉమేశ్​కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయులంతా ఉన్నత విద్య అభ్యసించిన వారేనని గుర్తు చేశారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిబాపూలే ఉన్నత చదువులు అభ్యసించి దేశ అభివృద్ధికి పునాదులు వేశారని గుర్తుచేశారు. వీసీ మాట్లాడుతూ.. స్టూడెంట్స్​మహనీయుల చరిత్రను తప్పక తెలుసుకోవాలన్నారు. 

వర్సిటీలో మహనీయుల జయంతిని ఒక ఉద్యమంలా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం  జాతీయస్థాయి సెమినార్ కు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలోరిజిస్ట్రార్ రవికుమార్, వోఎస్డీ హరికాంత్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత, మనోహర్, ఎస్సీఎస్టీ సెల్ డైరెక్టర్ పద్మావతి, మైనారిటీ సెల్ డైరెక్టర్ ఉమేరా తస్లీమ్, బీసీ సెల్ డైరెక్టర్  సరసిజ, సైన్స్ కాలేజీ  ప్రిన్సిపాల్ జయంతి, ఎగ్జామ్స్ కంట్రోలర్ అబ్రరూల్ బకి, వరప్రసాద్, రంగప్రసాద్,  గంగాధర ఎంపీడీవో రాము, ఎస్ ఆర్ ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి, లెక్చరర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.