మనోహరాబాద్ పీహెచ్​సీని తనిఖీ చేసిన కలెక్టర్

మనోహరాబాద్ పీహెచ్​సీని తనిఖీ చేసిన కలెక్టర్

మనోహరాబాద్, వెలుగు: మండల కేంద్రంలోని  పీహెచ్​సీని కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్, ఓపీ రిజిస్టర్, మందులు రూమ్ ని పరిశీలించారు. అనంతరం పలువురు బాలింతలతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పిటల్ కి ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. పీహెచ్​సీ మెడికల్ ఆఫీసర్ డ్యూటీకి ఎందుకు రాలేదని ఆరా తీశారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.