- కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లు స్టూడెంట్స్‌లో సృజనాత్మకత పెంచాలని కలెక్టర్రాహుల్సూచించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు స్కూళ్లలో పునరుత్పాదకత ఇంధన వనరుల అంశంపై స్టూడెంట్స్‌కు వ్యాస రచన పోటీలను నిర్వహించారు. అంతకు ముందు మెదక్‌పట్టణంలోని ధ్యాన్చంద్చౌరస్తా నుంచి తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వ స్కూళ్లలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 562 స్కూళ్లలో రూ.20 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు కల్పించామన్నారు. టీచర్ల బదిలీలు, నియామకాల్లో 617 మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని డీఎస్సీ -2024 ద్వారా 270 మంది కొత్త టీచర్లను నియమించామని తెలిపారు.
డైట్, కాస్మొటిక్‌చార్జీలు గతంలో ఉన్న దానికంటే 40 శాతం పెంచినట్లు పేర్కొన్నారు. అనంతరం వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్‌కు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్చైర్మన్చంద్రపాల్, డీఈవో రాధాకిషన్, డీఎస్వో రాజిరెడ్డి, ఎంఈవో నీలకంఠం, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్సుదర్శనమూర్తి, టీచర్లు పాల్గొన్నారు.