- కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
వర్ని, వెలుగు: విద్యా, వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) ని ఆకస్మికంగా తనిఖీచేశారు. లేబోరేటరీ గదిని, ఇన్‌పేషెంట్ వార్డు, హెల్ప్‌డెస్క్,వ్యాక్సినేషన్ గదిని,హాస్పిటల్ పరిసరాలను పరిశీలించారు. డ్రగ్ స్టోర్ గదిలోని మందుల నాణ్యత, వాటి కాలపరిమితిని చెక్ చేశారు.
ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎంతమంది ఇన్‌పేషెంట్‌లు చేరుతున్నారు. సరిపడా మందులు ఉన్నాయా.. అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమయ పాలనా పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం పాతవర్ని లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక,ఉన్నత పాఠశాల, మహాత్మజ్యోతిభాపూలే బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌రూం,కిచెన్‌లను తనిఖీ చేసి బియ్యం కూరగాయాలు,ఇతర సరుకులను ఆయన పరిశీలించారు.
తరగతి గదులను సందర్శించి స్టూడెంట్స్‌కు అందుతున్న టీచింగ్ తీరును తెలుసుకున్నారు. ఐదో తరగతి స్టూడెంట్స్‌కు ఆంగ్లం సబ్జెక్టులో ని పాఠాలు చదివించారు. ఏకాగ్రతతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని కలెక్టర్ స్టూడెంట్స్‌కు సూచించారు. కాగా ఉన్నత పాఠశాలలో తరగతి గదుల కొరత ఉందని స్కూల్ హెచ్‌ఎం కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ అదనపు తరగతి గదులను మంజూరు
చేయిస్తానన్నారు.