
- కలెక్టర్ రాజీవ్‌గాంధీ
నిజామాబాద్, వెలుగు : ఈనెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లాలో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మండల ఆఫీసర్లు మరోసారి పోలింగ్ సెంటర్లు విజిట్ చేసి లోపాలు ఉంటే సరిచేయాలన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో ఆయా శాఖల అధికారులతో ఆయన మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. షామియానాలు, తాగునీరు, వీల్చైర్తోపాటు మెడికల్ స్టాఫ్ ప్రతి సెంటర్లో ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ ఏర్పాట్లపై పొలిటికల్ పార్టీ లీడర్లకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
పోలింగ్తర్వాత సెక్టోరియల్ ఆఫీసర్ పర్యవేక్షణలో పూర్తి సెక్యూరిటీ మధ్య బ్యాలెట్‌బాక్స్‌లను కరీంనగర్ కౌంటింగ్ సెంటర్‌కు తరలించాలని తెలిపారు. బ్యాలెట్ సేఫ్టీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీవోలు రాజాగౌడ్, రాజేంద్రకుమార్, అడిషనల్ డీసీపీ రాంచంద్రారావు, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, నాగూరావు తదితరులు పాల్గొన్నారు.
యూఎన్వో ప్రొగ్రాంకు పూర్తి సహకారం..
ఉపాధి కోసం గల్ఫ్ వలసబాట పట్టి మరింత చితికిపోతున్న కుటుంబాలను ఆదుకోడానికి ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) జిల్లాలో చేపట్టే ప్రతి ప్రోగ్రామ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ జిల్లాను యూఎన్వో మైగ్రేషన్మల్టీ ఫార్టునర్ఫండ్ (ఎంఎంటీఎఫ్) కోసం పైలెట్ ప్రాజెక్ట్కింద ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. శుక్రవారం యూఎన్వో ప్రతినిధి డాక్టర్ లిస్సీ జోసెఫ్ తోనిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో గల్ఫ్ వలసలు, వారి కుటుంబాల జీవన స్థితిగతులపై కలెక్టర్ ఆమెకు వివరించారు.