![టెన్త్ రిజల్ట్‌పై ఫోకస్ పెట్టాలి : రాజీవ్‌గాంధీ](https://static.v6velugu.com/uploads/2025/02/collector-rajiv-gandhi-hanumanthu-focuses-on-education-and-election-administration_UpxVwSa1H9.jpg)
- కలెక్టర్ రాజీవ్‌గాంధీ
నిజామాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో మౌలిక వసతులు పెంచామని, డీఎస్సీ ద్వారా నియమకాలు జరిగినందున టెన్త్ రిజల్ట్‌పై టీచర్లంతా ఫోకస్పెట్టాలని కలెక్టర్రాజీవ్గాంధీ హనుమంతు సూచించారు. బార్డర్మార్కులతో స్టూడెంట్స్పాస్ అయితే ఉన్నత విద్యలో వెనుకబడతారన్నారు. శుక్రవారం ఆయన తన ఆఫీస్‌లో జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల హెచ్ఎంలతో మీటింగ్ నిర్వహించారు. స్కూల్స్విజిట్ చేసినప్పుడు స్టూడెంట్స్సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నం చేయగా సంతృప్తికర సమాధానాలు రాలేదన్నారు.
ప్రైమరీ లెవల్ నుంచి మెరుగైన విద్యను అందిస్తే సమర్థులుగా తయారవుతారన్నారు. టెన్త్ ఫైనల్ఎగ్జామ్స్కు టైం దగ్గరపడుతున్నందున మరింత ప్లాన్‌తో సిలబస్ పూర్తి చేసి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని కోరారు. స్టూడెంట్స్‌లో పోటీతత్వాన్ని పెంచాలన్నారు. అపార్ నమోదులో ముందంజలో ఉన్న హెచ్ఎంలను, ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న కాంప్లెక్స్ టీచర్లను ఆయన సన్మానించారు. అడిషనల్కలెక్టర్కిరణ్కుమార్, డీఈవో అశోక్, ఎగ్జామ్స్కంట్రోల్ఆఫీసర్ విజయభాస్కర్, ఎంఈవోలు అటెండయ్యారు.
ఎన్నికల రూల్స్ పాటించాలి..
బాల్కొండ : ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు పక్కాగా అమలుచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం భీంగల్, వేల్పూర్ మండలాల్లో పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి, గ్రాడ్యుయేట్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ర్యాంప్ టాయిలెట్స్, విద్యుత్ సరఫరా,నీటి వసతి పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఓటర్ల సంఖ్య కనుగుణంగా పట్టభద్రులు,టీచర్ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్లో సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలని సూచించారు. అనంతరం భీంగల్, వేల్పూర్ మండల కేంద్రాల్లో స్కూళ్లను సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. బియ్యం, కూరగాయలు, ఇతర సామగ్రిని పరిశీలించారు. మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో పంపిణీ చేసిన దుప్పట్లు, కాస్మోటిక్ కిట్లను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, మండల స్థాయి ఆఫీసర్లు పాల్గొన్నారు.