పంటలకు సరైన రేటు ఇవ్వాలి : రాజీవ్​గాంధీ

పంటలకు సరైన రేటు ఇవ్వాలి : రాజీవ్​గాంధీ
  • కలెక్టర్​ రాజీవ్​గాంధీ

నిజామాబాద్, వెలుగు :  వచ్చే నెల వరకు జరిగే ఎర్ర, తెల్ల జొన్న, పసుపు అమ్మకాలను అగ్రికల్చర్, హార్టికల్చర్​ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రజొన్న కొనుగోళ్ల విషయంలో సీడ్​ కంపెనీ ఓనర్లు రైతులతో చేసుకున్న బైబ్యాక్​ అగ్రిమెంట్​కు కచ్చితంగా కట్టుబడాలని, మార్కెట్​ రేట్​కు తగ్గకుండా తెల్ల జొన్నలకు ధర ఇవ్వాలని వ్యాపారులకు సూచించారు.

అధిక రేట్​లభించే చోటకు రైతులు వెళ్లాలనుకుంటే ఆపోద్దన్నారు. మోసానికి పాల్పడే వ్యాపారులు ఎంతటివారైనా ఊరుకోమని హెచ్చరించారు. పసుపు అమ్మకాల విషయంలో కూడా రైతుల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇందూర్​ మార్కెట్ గంజ్​​లో కమీషన్​దారుల రోల్​లేని డైరెక్ట్​ పర్చేస్ సెంటర్​ఓపెన్​ చేయించామని​తెలిపారు. రైతులు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. 

తేమ లేకుండా పసుపును బాగా ఆరబెట్టి మార్కెట్​కు తెస్తే మంచి ధర లభిస్తుందన్నారు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్​కుమార్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వాజీద్ హుస్సేన్​, హార్టికల్చర్​ ఆఫీసర్​ శ్రీనివాస్​, మార్కెటింగ్​ శాఖ ఏడీ గంగవ్వ, ఏడీఏ, ఏవో, పసుపు ట్రేడర్లు , సీడ్​ కంపెనీ ఓనర్లు ఉన్నారు.

హాస్టల్​లో రాత్రి కలెక్టర్ బస..

ఎడపల్లి/ నిజామాబాద్, వెలుగు : ఎడపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాయ్స్ హాస్టల్​లో గురువారం రాత్రి కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు బస చేశారు. డిన్నర్​ టైంకు చేరుకొని భోజనం నాణ్యతను పరిశీలించారు. స్టడీ అవర్స్​ కొనసాగుతున్న రూమ్స్​విజిట్​చేసి టెన్త్​, ఇంటర్ స్టూడెంట్స్​తో భేటీ అయ్యారు. పలు సబ్జెక్ట్స్​ పై విద్యార్థులకు ప్రశ్నలు వేసి అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించారు. స్టోర్​రూమ్​, డార్మెటరీ, కిచెన్​ను పరిశీలించి స్టూడెంట్స్​తో కలిసి హాస్టల్​లో నిద్రించారు. ఆయన వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ప్రిన్సిపాల్ జైపాల్ తదితరులు ఉన్నారు.