ప్రాపర్టీ ట్యాక్స్​ వందశాతం వసూలు చేయాలి : రిజ్వాన్​బాషా షేక్​

ప్రాపర్టీ ట్యాక్స్​ వందశాతం వసూలు చేయాలి : రిజ్వాన్​బాషా షేక్​
  •  కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలో ప్రాపర్టీ ట్యాక్స్​వందశాతం వసూలు చేయాలని కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్​ ఆదేశించారు. బుధవారం మున్సిపల్​అధికారులతో జూమ్ మీటింగ్​నిర్వహించారు. ట్యాక్స్​టార్గెట్ ఎంత, వసూలు చేసిందెంత.. ఎంత మందికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. పన్ను చెల్లించనివారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. రేపటి నుంచి పురోగతి కనిపించాలని, గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. 

ఇంటర్ ఎగ్జామ్ సెంటర్​తనిఖీ

జనగామ సోషల్​వెల్ఫేర్​కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్ ను కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్​తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పించిన సదుపాయాలపై ఆరా తీశారు. 
కేజీబీవీలకు ఇన్సినరేటర్లు అందజేతజిల్లాలోని  కేజీబీవీలకు కలెక్టర్ రిజ్వాన్​బాషా షేక్​చొరవతో బుధవారం ఇన్సినరేటర్లు అందజేశారు. ఒక్కోదాని విలువ రూ. 21 వేలు కాగా, రోజుకు 100 నాప్కిన్స్​ను కాల్చివేస్తాయి.