జనగామ అర్బన్/ కురవి, వెలుగు: జనగామ జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం పూర్తయిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో జిల్లా రాష్ర్టంలో 5వ స్థానంలో ఉందని వెల్లడించారు. ఈ నెల 8 న మహిళా సాధికారత, హక్కులు, లైంగిక వేధింపుల నివారణ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో హాజరు కావాలని ఆదేశించారు.
సమీక్షలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్జిల్లా కురవి మండలంలోని అయ్యగారిపల్లి, తట్టుపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇండ్ల సర్వేను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట కురవి తహసీల్దార్ సునీల్‌రెడ్డి తదితరులున్నారు.