సాగు నీరు విడుదల చేయండి : కలెక్టర్​సంతోష్​

సాగు నీరు విడుదల చేయండి : కలెక్టర్​సంతోష్​
  • కలెక్టర్​సంతోష్​
  • కొండాపురంలో ఎండిన పంటల పరిశీలన

కేటి దొడ్డి, వెలుగు: సాగునీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం కేటి దొడ్డి మండలంలోని కొండాపురంలో నీటి కొరతతో ఎండిపోయిన పంటలను ఫీల్డ్​విజిట్​చేశారు. 104 వ ప్యాకేజీ  ర్యాలంపాడు ప్రధాన కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి, వారి సమస్యలు  తెలుసుకున్నారు. సాగు నీటిని తక్షణమే కాలువలకు విడుదల చేయాలని అధికారులకు సూచించారు.  ఇరిగేషన్ ఈఈ రహీముద్దీన్, అగ్రికల్చర్ ఆఫీసర్ సక్రియ నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి, విద్యుత్ ఏడీ రమేశ్​బాబు తదితరులు పాల్గొన్నారు.

ఏటీసీల ఏర్పాటుకు ప్రపోజల్స్..

జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో ఏటీసీల ఏర్పాటుకు మూడెకరాల స్థలాన్ని గుర్తించామని, పూర్తి వివరాలతో సోమవారంలోగా ప్రపోజల్స్ పంపిస్తామని కలెక్టర్​ సంతోష్​ తెలిపారు. గురువారం రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కలెక్టర్ తో సమీక్ష నిర్వహించారు.

 నీరు పొదుపుగా వాడుకోవాలి

గండీడ్, వెలుగు: మహమ్మదాబాద్, అన్నారెడ్డి పల్లి, ముకర్లబాద్ లలో వరి పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్, తహసీల్దార్ తిరుపతయ్య గురువారం పరిశీలించారు. ఎండలు ముదురుతున్నందున నీటిని పొదుపుగా వాడుకొని, పంటలను రక్షించుకోవాలని రైతులకు సూచించారు. ఏవో నరేందర్, ఏఈవో  నికిత పాల్గొన్నారు.