కోరుట్ల,వెలుగు: వెటర్నరీ సైన్స్నోబెల్ ప్రొఫెషన్ అని, ఈ రంగం రైతుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల కలెక్టర్సత్యప్రసాద్ అన్నారు. సోమవారం రాత్రి కోరుట్లలోని పీవీ నర్సింగరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వెటర్నరీ సైన్స్ కాలేజీలో యాన్యువల్ డేకు చీఫ్ గెస్ట్‌గా కలెక్టర్ హాజరై మాట్లాడారు. వెటర్నరీ రంగంలో ఆవిష్కరణలకు విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రశంసించారు.
అనంతరం కాలేజీ మ్యాగజైన్ విడుదల చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శరత్చంద్ర, డీన్ఆఫ్ స్టూడెంట్అఫైర్స్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్, ఫ్యాకల్టీ ఉదయ్‌కుమార్, జిల్లా వెటర్నరీ ఆఫీసర్ ఎస్ఎల్మనోహర్, వెటర్నరీ అసిస్టెంట్డైరెక్టర్, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్నరేశ్, ఆర్డీవో జివాకర్‌రెడ్డి, అసోసియేట్ డీన్ దాసరి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు
జగిత్యాల టౌన్, వెలుగు: అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం బీర్పూర్ మండల కేంద్రంలో ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు. యాప్ ద్వారా సర్వే చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. చిన్న కొల్వాయి గ్రామంలో ఇసుక రీచ్ తహసీల్దార్లతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. సఖీ సెంటర్లో రిజిస్టర్లను పరిశీలించారు. మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరేశ్, ట్రస్ట్ సీఈవో శ్రీనివాస్, సఖీ కేంద్రం సీఏ లావణ్య పాల్గొన్నారు.