పసుపు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. : సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌

పసుపు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. : సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌
  • మార్కెట్‌‌‌‌‌‌‌‌ సందర్శించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌ 

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లాలోని పసుపు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చారు. గురువారం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి పసుపు  కొనుగోళ్లపై ఆరా తీశారు. మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వ్యాపారులు, కమిషన్‌‌‌‌‌‌‌‌దారులు సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారి మద్దతు ధర ఇవ్వడం లేదన్న ఆరోపణలు రావడంతో తనిఖీ చేశారు. యార్డ్‌‌‌‌‌‌‌‌లో ఆరబోసిన పసుపును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం క్వింటాకు పసుపుకు ధర ఎంత వస్తోంది వచ్చిన డబ్బు గిట్టుబాటు అవుతుందా అని  ఆరా తీశారు.

ప్రస్తుత ధరతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి  లేదని వారు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోళ్లు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ద్వారా పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. 

టెన్త్‌‌‌‌‌‌‌‌ విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు 

జగిత్యాల టౌన్, వెలుగు: టెన్త్ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు ప్రిపేర్ కావాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాలలోని ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో పరీక్షల్లో సత్తాచాటాలని కాంక్షిస్తూ రూపొందించిన విజయీభవ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21నుంచి టెన్త్‌‌‌‌‌‌‌‌ పరీక్షలు ప్రారంభమవుతాయని, విద్యార్థులు అనవసర ఒత్తిళ్లకు లోనై ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్‌‌‌‌‌‌‌‌, డీఈవో రాము పాల్గొన్నారు.