నాణ్యమైన భోజనం అందించాలి

నాణ్యమైన భోజనం అందించాలి

నర్వ, వెలుగు: అంగన్​వాడీ సెంటర్లు, స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్​ ఆదేశించారు. మండలంలోని పాలర్చేడ్, రాయకోడ్​ గ్రామాలను గురువారం సందర్శించారు. ఈ నెల26న కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాయికోడ్ లోని మోడల్  అంగన్​వాడీ సెంటర్​ను సందర్శించి చిన్నారుల నైపుణ్యాన్ని పరిశీలించారు. పాలు, గుడ్లు, వంట సరుకులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

పల్లె దవాఖానకు వెళ్లి స్క్రీనింగ్, ఏఎన్సీ నమోదు రిజిస్టర్లను పరిశీలించి, అసంపూర్తిగా ఉండడంతో ఆశా కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ కు ఏఎన్ఎం ఎందుకు రాలేదని డీఎంహెచ్​వో  సౌభాగ్యలక్ష్మిని ప్రశ్నించారు. ఎస్సీ కాలనీకి తాగునీటి పైప్ లైన్, విద్యుత్  సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్ ను కోరగా, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యూపీఎస్​ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. డీఆర్డీవో మొగులప్ప, డీడబ్ల్యూవో జయ, తహసీల్దార్  మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్  పాల్గొన్నారు.