వరికి బదులు ఇతర పంటలు సాగుచేయాలి : త్రిపాఠి

వరికి బదులు ఇతర పంటలు సాగుచేయాలి :  త్రిపాఠి
  •    కలెక్టర్ ఇలా త్రిపాఠి 

చిట్యాల, వెలుగు:  భూగర్భ జలాలు తగ్గడం వల్ల వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. బుధవారం చిట్యాల పరిధిలోని రైతు కొంతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె సందర్శించి సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. నీటి సంరక్షణ కోసం రైతు తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వానాకాలం నుంచి వరికి ప్రత్యామ్నాయంగా పండ్లు, కూరగాయలు సాగుపై రైతులు దృష్టి సాధించాలని సూచించారు.

 నీటి వనరులను సంరక్షించుకునేందుకు ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని సూక్ష్మ, బిందు సేద్యం ద్వారా పంటలను సాగు చేయనుకోవాలని వివరించారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్ కుమార్, ఇన్​చార్జి జిల్లా ఉద్యానవనశాఖ అధికారి అనంతరెడ్డి, మండల వ్యవసాయ అధికారి గిరిబాబు, హార్టికల్చర్ ఆఫీసర్ శ్వేత, ఏఈవోలు, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, రైతులు ఉన్నారు.