25లోపు కాల్వ పనులు ప్రారంభించాలి

 25లోపు కాల్వ పనులు ప్రారంభించాలి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 25లోపు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ , ఇంజినీరింగ్ అధికారులతో బ్రాహ్మణ వెల్లెంల ఎడమ కాల్వ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం కింద కాల్వ నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం రూ.32 కోట్లను విడుదల చేసిందన్నారు. 

కాల్వ వెళ్లే గ్రామాల రైతుల నుంచి భూములకు సంబంధించిన పాస్ బుక్స్, ఇతర ధ్రువపత్రాలు సేకరించి త్వరగా పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో అశోక్ రెడ్డి, ప్రాజెక్టు డిప్యూటీ ఇంజినీర్ విఠలేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.