
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జనవరి 26 నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు తో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. అన్ని గ్రామ సభల వద్ద నాలుగు పథకాల అర్హుల జాబితా పెట్టాలని, గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులు, అర్జీలను స్వీకరించాలని ఆదేశించారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అర్హులందరికి అవకాశం కల్పించాలన్నారు. నాలుగు పథకాల కు వచ్చిన కొత్తగా దరఖాస్తులు ప్రత్యేక రిజిస్టర్ లు ఏర్పాటు చేసి కుటుంబ పెద్ద, కుటుంబ సభ్యులు పేర్లు, ఆధార్ నెంబర్ లు,కులం ఫోన్ నెంబర్ లు జాగ్రత్తగా నమోదు చేసుకోవాలని ఆదేశించారు.