- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో పూర్తి చేసిన పనులకు బిల్లులు త్వరగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్కూళ్లలో పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుపై వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల నిర్వహించిన పనుల ఎం.బి రికార్డు పూర్తి చేసి డీఈఓ కార్యాలయానికి వారంలోగా అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
పనులకు సంబంధించి ఫోటోలను, కమిటీ ధ్రువీకరణ సర్టిఫికెట్లను జతపరచాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈఓ ప్రవీణ్ కుమార్, హౌసింగ్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖలకి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.