సమయపాలన పాటిస్తూ సన్నద్ధం కావాలి

సమయపాలన పాటిస్తూ సన్నద్ధం కావాలి

నిర్మల్/ఆదిలాబాద్, వెలుగు: టెన్త్​ విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ పరీక్షలు బాగా రాయాలని నిర్మల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షి యల్ పాఠశాల, కాలేజీని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్​తో కలిసి సందర్శించారు. క్లాస్​రూమ్​లో విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. 

సిలబస్​ను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ ఒత్తిడి లేకుండా చదవాలన్నారు. పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని విద్యార్థులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. స్టూడెంట్లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. డీఈవో పి.రామారావు, కాలేజీ ప్రిన్సిపాల్ ప్రశాంతి, తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.

స్పెషల్​ క్లాసులను నిత్యం పర్యవేక్షించాలి

పదో తరగతి స్పెషల్ ​క్లాసులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో ఎంఈవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు, మెనూ ప్రకారం భోజనం, స్నాక్స్ అందించాలన్నారు.   విద్యార్థులు  ఒత్తిడికి   గురికాకుండా   అవగాహన కల్పించాలన్నారు.