ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

నిజామాబాద్ సిటీ, వెలుగు : నిజామాబాద్​ కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 62 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్​ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు.  

ప్రజావాణిలో 52 ఫిర్యాదులు

కామారెడ్డి టౌన్, వెలుగు :  కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 52 ఫిర్యాదులు వచ్చాయి.   కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్​లు దరఖాస్తులను స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్​ ఆదేశించారు.   కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ప్రజావాణి కార్యక్రమంలో విద్యుత్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని కామారెడ్డి ఎన్సీడీసీఎల్ ఎస్​ఈ శ్రవణ్​కుమార్ తెలిపారు. సోమవారం సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించారు. ఏడాది కాలంగా 444 ఫిర్యాదులు రాగా, 400 సమస్యలను పరిష్కరించామని ఆయన తెలిపారు.