ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

సూర్యాపేట, నల్గొండ అర్బన్, యాదాద్రి, వెలుగు : ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్,  ఇలా త్రిపాఠి, అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట, నల్గొండ అర్బన్, యాదాద్రి కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణిలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా నుంచి మొత్తం 58  దరఖాస్తులు వచ్చాయి.

 వాటిలో  భూ సమస్యలకి సంబంధించినవి 22, డీఆర్డీఏ 9, పంచాయతీ రాజ్ శాఖ 6, వివిధ శాఖలకు సంబంధించి 21 వచ్చాయని అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా నుంచి మొత్తం 100 దరఖాస్తులు వచ్చాయని, వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని కలెక్టర్​ఆదేశించారు. యాదాద్రి జిల్లా నుంచి మొత్తం 57 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి పరిష్కరించాలని అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు.