రిపబ్లిక్​ డే కు ఏర్పాట్లు చేయాలె : రాహుల్​రాజ్, మనుచౌదరి

 రిపబ్లిక్​ డే కు ఏర్పాట్లు చేయాలె : రాహుల్​రాజ్, మనుచౌదరి
  • కలెక్టర్లు రాహుల్​రాజ్, మనుచౌదరి

మెదక్​టౌన్, వెలుగు: రిపబ్లిక్​డే వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​రాహుల్​రాజ్​ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్  కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉత్తమ ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందించడానికి  జాబితా అందజేయాలన్నారు. వేడుకలకు సంబంధించి ప్రొటోకాల్​ పాటిస్తూ అతిథులకు  కుర్చీలు ఏర్పాటుచేయలన్నారు.

 పోలీస్ పరేడ్​గ్రౌండ్​లో ఆయా శాఖల స్టాళ్లు, శకటాలను సిద్ధం చేయాలన్నారు. అంబులెన్స్​లు, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్​లో ఈ -ఆఫీస్​ అమలు చేయాలని, లెస్​పేపర్, లెస్​ప్లాస్టిక్​, లెస్​ఎలక్ట్రిసిటీ విధానం పాటించి అందరికి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ నగేశ్, డీఆర్​వో భుజంగరావు, డీపీవో యాదయ్య, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీఏపీడీ శ్రీనివాస్​రావు, డీఈవో రాధాకిషన్​, డిప్యూటీ డీఎంహెచ్​వో నవీన్​ మల్కాజీ, ఆర్డీవో రమాదేవి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలి

 ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని కలెక్టర్​రాహుల్​రాజ్, ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి సూచించారు. శుక్రవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మెదక్​కలెక్టరేట్​నుంచి బైక్​ర్యాలీని ప్రారంభించి, నర్సాపూర్, తూప్రాన్​చౌరస్తాలోని వెల్​కమ్​బోర్డు వరకు బైక్​నడిపారు. అనంతరం వారు మాట్లాడుతూ..హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దన్నారు. హెల్మెట్ లేదంటే బంక్​ల్లో పెట్రోల్ పోయవద్దన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ప్రవేశపెడుతామన్నారు. ఫోర్ వీలర్ నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​నగేశ్, డీటీవో వెంకటస్వామి, ఏఎస్పీ మహేందర్​, డీఎస్పీ ప్రసన్న కుమార్​, డాక్టర్​నవీన్​కుమార్, ఇతర అధికారులు
 పాల్గొన్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి 

సిద్దిపేట టౌన్: రిపబ్లిక్​డే వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి పరిశీలించారు.  గ్రౌండ్ లో స్టేజీ, వీఐపీ, మీడియా, ప్రజాప్రతినిధులు సిట్టింగ్ అరేంజ్​మెంట్​, జాతీయ జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం, పరేడ్ పరిశీలన, ప్రొటోకాల్, కల్చరల్ ప్రోగ్రామ్స్ తదితర అంశాల గురించి అధికారులకు సూచనలు  చేశారు. వేడుకలకు హాజరయ్యే అందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కూమార్ నిర్దేశించారు.  కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, ఏసీపీ మధు, ఏవో అబ్దుల్ రహమాన్, డీపీఆర్ వో రవికుమార్, ఐ అండ్ పీఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూపాల్, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి, విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రమోహన్  పాల్గొన్నారు.

ALSO READ | తెలంగాణలో ఫీజుల కట్టడికి చట్టం.!సిఫారసులు ఇవే..