సీఎంసీని  సద్వినియోగం చేసుకోవాలి : జడ్జి కుంచాల సునీత

సీఎంసీని  సద్వినియోగం చేసుకోవాలి : జడ్జి కుంచాల సునీత
  • జిల్లా జడ్జి కుంచాల సునీత

ఆర్మూర్, వెలుగు : స్వల్ప వివాదాలపై కోర్టు, పోలీస్ స్టేషన్ లకు వెళ్లకుండా ప్రజలు కమ్యూనిటీ మీడియేషన్​ సెంటర్​(సీఎంసీ)ను  సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు.  మంగళవారం ఆర్మూర్ టౌన్ లోని మేరు సంఘం భవనంలో తెలంగాణ హైకోర్టు సౌజన్యంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్​ను  ప్రారంభించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ  సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన  సీఎంసీని  ఉపయోగించుకోవాలన్నారు.

ఈ సంటర్​లో శిక్షణ పొందినవారితో కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఎలాంటి ఫీజులు లేకుండా ఉచిత సేవలు అందజేస్తారన్నారు.  కార్యక్రమంలో ఆర్మూర్ సీనియర్ జడ్జి నజీమ్ సుల్తానా, జూనియర్ జడ్జి దీప్తి, నిజామాబాద్​సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, ఏసీపీ గట్టు బస్వారెడ్డి, సీఐ రవి కుమార్, డీఎల్ఎస్​ఏ సూపరింటెండెంట్​పురుషోత్తమ్ గౌడ్,  ఆర్మూర్​ కేంద్రం ప్రతినిధులు బాబా గౌడ్, గుజరాతి నివేదన్, శంకర్ గౌడ్,  బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్​ తెడ్డు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.