సిస్టమ్ వర్క్ పేరిట తీసుకెళ్లి సైబర్ క్రైమ్

సిస్టమ్ వర్క్ పేరిట తీసుకెళ్లి సైబర్ క్రైమ్
  • బ్యాంకాక్ లో కరీంనగర్ జిల్లా మానకొండూరు వాసికి వేధింపులు 
  • పాస్ పోర్టు లాక్కొని ఇబ్బందులు 
  • తన కొడుకును ఇండియాకు తీసుకురావాలని తండ్రి వేడుకోలు

కరీంనగర్, వెలుగు: ఉపాధి కోసం బ్యాంకాక్ కు వెళ్లిన ఓ యువకుడిని అక్కడి కంపెనీ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి తండ్రి కొక్కిరాల లక్ష్మారెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన కొక్కిరాల మధుకర్ రెడ్డి ఓ కంపెనీలో సిస్టమ్ వర్క్ చేసేందుకు గత జనవరి 2న బ్యాంకాక్ వెళ్లాడు. నెలకు రూ.లక్ష జీతం ఇస్తామని చెప్పిన నమ్మించి తీసుకెళ్లిన సైబర్ కేఫ్ మేనేజ్ మెంట్ పాస్ పోర్ట్ తీసుకుని, సైబర్ క్రైమ్ లో వినియోగించుకోవడం, నిబంధనలతో జీతంలో కోత విధించడంతో ఉండడానికి, భోజనానికి కూడా డబ్బులు సరిపోక ఇబ్బందులు పడుతున్నాడు. 

 తన కొడుకుతోపాటు 45 మంది తెలుగువాళ్లు ఆ కంపెనీలో పని చేస్తున్నారని, తిరిగి ఇండియాకు వెళ్తామంటే పాస్ పోర్ట్ లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తన కొడుకు ఫోన్ చేసి చెప్పినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తన కొడుకును తిరిగి ఇండియాకు తిరిగి వచ్చేందుకు సహకరించాలని కోరారు.