కేసీఆర్ చేసిన తప్పుకు రైతులు బలయ్యారు

  • నా పాదయాత్ర వల్లే కేసీఆర్ వడ్లు కొంటామని దిగివచ్చిండు: షర్మిల
  • 54వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

మహబూబాబాద్ జిల్లా:  తాను చేస్తున్న పాదయాత్ర వల్లే సీఎం కేసీఆర్ దిగి వచ్చి రైతుల దగ్గర వడ్లు కొంటామని దిగి వచ్చాడని వైయస్ షర్మిల అన్నారు. కేసీఆర్ చేసిన తప్పుకు  రైతులు నష్టపోయారని.. కాబట్టి వరి సాగు చేయని రైతులకు నష్టం పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర బుధవారం 54వ రోజుకు చేరుకుంది. ఇవాళ బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామానికి చేరింది షర్మిల  పాదయాత్ర. 
బయ్యారం మండలంలో మూడో రోజు షర్మిల  పాదయాత్ర కొనసాగుతోంది. దారిపొడవునా ఎదురైన స్థానికులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు షర్మిల. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ నా పాదయాత్ర వల్లనే కేసీఆర్ వడ్లు కొంటామని దిగివచ్చాడన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పట్ల  ఉసరవెల్లి వేషాలు వేస్తున్నాడని ఆమె ఆరోపించారు. డిల్లీలో కేసీఆర్  చేసింది ధర్నా కాదు ఫోటో షూట్ అని షర్మిల ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదని ఆమె పేర్కొన్నారు. 

 

ఇవి కూడా చదవండి

పాతబస్తీలో పోలీసు బలగాల మొహరింపు

ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి

ప్రభుత్వ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త