దళితబంధు ఇస్తలేరని కలెక్టరేట్​లో ఫిర్యాదు

కరీంనగర్ టౌన్, వెలుగు:  కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు దళిత బంధు, పింఛన్ దరఖాస్తులు వెల్లువెత్తాయి.  హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లోని పలువురు దళితబంధు పథకం రావడం లేదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు దరఖాస్తులు సమర్పించారు.  ప్రజావాణిలో 176 దరఖాస్తులను కలెక్టర్​ స్వీకరించి, వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్లు నవీన్ నికోలస్, లెనిన్ వత్సల్ టోప్పో, జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.