దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. సంక్రాంతి పర్వదినాన హరిద్వార్ లో పుణ్యస్నానాలపై కఠిన ఆంక్షలను విధించింది. ఈ పర్వదినాన గంగా నదిలో నిర్వహించే పవిత్ర స్నానాలపై సంపూర్ణ నిషేధం విధించింది. హరిద్వార్ లో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. జనవరి 14వ తారీఖున భక్తులు ఎవరూ కూడా గంగానది స్నానాల కోసం రావొద్దని హరిద్వార్ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. 14నుండి రాత్రి 10గంటల నుండి తెల్లవారుజాము 6గంటలవరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు తెలిపింది.
మరిన్ని వార్తల కోసం..
ఐసోలేషన్ పేషెంట్లకు యోగా క్లాసుల లింకులు