హైదరాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ముందున్న ప్రహరి గోడ కుప్పకూలింది. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ప్రహరిగోడ అదేపనిగా కురుస్తున్న వర్షాలకు తడిసి రోడ్డు వైపు కూలిపోయింది. దీంతో ప్రహరి గోడ పక్కన పార్క్ చేసిన రెండు కార్లు ప్రహరీ శిథిలాల కింద ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని కూలిన ప్రహారి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.